madhavi Reddy: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు..అంజాద్ బాషా బెయిల్ పై విడుదల..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సోషల్ మీడియా ద్వారా అసభ్య పోస్టులు పోస్టు చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యక్తిగత కార్యదర్శి షేక్ మొహమ్మద్ ఖాజాను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం డీఎస్పీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో నిందితుడిని మీడియా ముందుకు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. తేదీ ప్రకారం, అంజాద్ బాషా సోదరుడు అహమ్మద్ బాషా ప్రోత్సాహంతో మొహమ్మద్ ఖాజా, ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా అసభ్య పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ విషయంలో, తెదేపా జిల్లా...