జర్నలిస్టును బెదిరించడం సరికాదు
చికిత్స పొందుతున్న సూరిని పరామర్శించిన నాయకులు కాకతీయ, కొత్తగూడెం రూరల్: కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు జర్నలిస్టును బెదిరించే ధోరణిలో మాట్లాడడం సరికాదని బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బస్టాండ్ దగ్గర ప్రమాదకరంగా ఏర్పడిన గుంతను పూడ్చాలని విలేఖరి చదలవాడ సూరి కథనం రాశాడు. ఈ విషయంలో రాజకీయ నాయకుడు బెదిరించడంతో మనస్థాపానికి గురైన విలేకరి సూరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూరిని సోమవారం ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల స్వేచ్ఛను అనగతొక్కాలని...