సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, పీ.ఓ. ఎంహెచ్‌ఎన్ డాక్టర్ సనా జవేరియాతో కలిసి చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్శనలో అటెండెన్స్ రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టర్ సహా పలు రికార్డులను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలను పరిశీలించి, వారికి అందజేస్తున్న ఉచిత మందుల సరఫరా పరిస్థితిని సమీక్షించారు. అవుట్ పేషెంట్లతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న...