Jobs: మహిళలకు గుడ్ న్యూస్..అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్. అంగన్వాడీలో హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. విశాఖపట్నం జిల్లాలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ICDS ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో భీమునిపట్నం ప్రాజెక్ట్‌లో 11, పాండురి ప్రాజెక్ట్‌లో 21, అలాగే విశాఖపట్నం ప్రాజెక్ట్‌లో 21 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరగనుంది....