ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కాకతీయ, నర్సింహులపేట : రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సింహులపేటలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు మైదం దేవేందర్ అధ్యక్ష‌త‌న ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన రెడ్యానాయక్ మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. బాకీ పడ్డ గ్యారెంటీ కార్డులను కార్యకర్తలు గ్రామగ్రామానపంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలన...