ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి; ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు జిల్లా అధికారులు తమ వద్ద పెండింగ్ లేకుండా చూడాలని, దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఖమ్మం నగరం వినోబా నవోదయ కాలనీవాసులు హైకోర్టు...