సత్యనారాయణ మరణం బాధాకరం
ఎమ్మెల్యే కూనంనేని కాకతీయ, జూలూరుపాడు: సీపీఐ మండల సీనియర్ నాయకుడు వల్లపిన్నీ సత్యనారాయణ ఇటీవల మరణించారు. ఆయన దశదిన కార్యక్రమానికి సోమవారం కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై సత్యనారాయణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతర కూనంనేని మాట్లాడుతూ వలపిన్ని మరణం చాలా బాధాకరమని, ఆయన పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామన్నారు. బాధిత కుటుంబానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సీపీఐ మండల...