Gold Rate: దూసుకెళ్తున్న బంగారం ధర..తులం రూ. లక్షా.23వేలు

కాకతీయ, నేషనల్ డెస్క్: బంగారం ధర భారీగా పెరుగుతోంది. రోజుకో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. ట్రంప్, టారిఫ్ లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్రీయ బ్యాంకులు కొనుగోళ్లు కలిపి బంగారానికి ఇన్నాళ్లు డిమాండ్ పెరిగింది. తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇంకా కొనసాగుతుండటంతో బంగారం ధరలు అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 4వేల డాలర్ల దిశగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగా బంగారం ధర సరికొత్త రికార్డులను క్రియేట్...