ఏజెన్సీలో అన్ని పదవులు ఎస్టీలకే కేటాయించాలి
ఆదివాసీ ఐక్య కార్యచరణ కమిటీ కాకతీయ, గుండాల: మండలంలోని యాపలగడ్డ గ్రామం పగిడిద్దరాజు గద్దెల వద్ద ఆదివాసి సంఘాల సమావేశం ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు పూణెం రమణబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు వాగబోయిన చంద్రయ్య దొర పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అయినందున ఏజెన్సీలో ఇతర కులాలకు రిజర్వేషన్ కల్పించడం అనేది...