కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాకతీయ, మణుగూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను ఎండగట్టాలని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేగా మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులను స్థానిక సంస్థల్లో ఓట్లు అడగడం...