పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు సరికాదు
స్వతంత్ర దేశంగా 145 దేశాలు గుర్తింపు ఐరాసలో అమెరికా వ్యతిరేకించడం సిగ్గుచేటు సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ కాకతీయ, వరంగల్ బ్యూరో : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ జరుపుతున్న జినోసైడ్ హత్యాకాండ, దురాక్రమణ దాడులను ఖండిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించారు....