గడువులోగా ప్రాజెక్టులు పూర్తి..
2027 డిసెంబర్ నాటికి ఎస్ఎల్‌బీసీ.. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష కాకతీయ, తెలంగాణ బ్యూరో : తుమ్మడిహట్టి బ్యారేజీని నిర్మించి, 2027 డిసెంబర్ నాటికి ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల పనులను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గడువులోగా అమలు చేయడం, సంస్థాగత జవాబుదారీతనం, సాంకేతిక పారదర్శకతపై స్పష్టమైన దృష్టి సారించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ...