Ration Card: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారంతా అనర్హులే..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే కాకుండా, అర్హులకే సబ్సిడీ లబ్ధి అందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా, లేదా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయకపోయినా, సంబంధిత రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా న్యాయమైన పంపిణీ విధానం కొనసాగేందుకు ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. రేషన్ కార్డుదారులు తమ ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా...