ఆక్రమణకు అడ్డుకట్ట..
ఆక్రమణకు అడ్డుకట్ట.. ప్రభుత్వ భూమిలో బోర్డు పాతిన అధికారులు.. కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ పట్టణంలోని విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించేందుకు దుండగులు ప్రయత్నించగా, రెవెన్యూ అధికారులు సకాలంలో జోక్యం చేసుకుని ఆ భూమిని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ హంటర్ రోడ్ పరిధిలోని సర్వే నెంబర్ 964లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, హద్దులు పాతి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టే యత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు హనుమకొండ రెవెన్యూ అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా...