గ్రూప్ – 1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి

ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను తుంగలో తొక్కిన ప్ర‌భుత్వం అభ్యర్థుల ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేస్తే ఊరుకోం.. నిరుద్యోగులతో కలిసి కమిషన్‌ను స్తంభింప చేస్తాం.. రేవంత్ స‌ర్కార్‌కు క‌విత హెచ్చ‌రిక‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : గ్రూప్ - 1 నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాల‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా... వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదని...