Donald Trump: నా టారిఫ్స్ వల్లే 7దేశాల యుద్ధాలు ఆగాయి..ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఉణ్న టారిఫ్స్ విధించే శక్తి వల్లే ప్రపంచ యుద్ధాలను ఆపగలిగాను అంటూ పేర్కొన్నారు. ఆ శక్తే లేకుంటే ప్రస్తుతం ప్రపంచంలో కనీసం నాలుగు దేశాల మధ్య భీకర యుద్ధాలు జరిగేవని వివరించారు. పలు దేశాలపై టారిఫ్స్ విధించడం వల్ల ప్రపంచంలో శాంతి నెలకొల్పడంతో పాటు అమెరికాకు భారీ మొత్తంలో డబ్బు సమకూరుతోందని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో...