కాంగ్రెస్ పై మరోసారి విరుచుపడిన మోదీ.. పాక్ పై ఎందుకు దాడి చేయలేదో చెప్పాలని నిలదీత..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008లో ఉగ్రదాడికి దీటుగా ఎందుకు ప్రతిస్పందించలేదని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విదేశీ ఒత్తిడి వల్లే కాంగ్రెస్ వెనక్కి తగ్గిందన్నారు ప్రధాని. నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆ సమయంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముంబై ఆర్థిక రాజధాని మాత్రమే కాదు.. దేశంలో అత్యంత శక్తివంతమైన నగరాల్లోనూ ఒకటిగా...