విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ.
విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ. ఉపాధ్యాయుడు సత్యనారాయణ సేవాభావం ప్రశంసనీయం.. కాకతీయ, కరీంనగర్ : విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఉపాధ్యాయుడు ఉదారత ప్రదర్శించాడు. కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎన్. సత్యనారాయణ తన సొంత ఖర్చుతో రూ.40,000 విలువైన క్రీడా దుస్తులను మొత్తం 104 మంది విద్యార్థులకు విరాళంగా అందజేశాడు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.పాఠశాల అభివృద్ధికి నా వంతు సహకారంగా క్రీడా దుస్తులు అందజేశాను. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, పాఠశాలకు,ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి....