BC Reservations: స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ కోటాపై హైకోర్టులో విచారణ.. పిటిషన్లన్నీ కలిపి విచారణ

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లన్నింటినీ ఒకే సారి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే పిటిషన్లు, వ్యతిరేకించే పిటిషన్లు అన్నీ ఒకే దశలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 9 ప్రకారం బీసీల రిజర్వేషన్ శాతం 25 నుంచి...