Fire Accident: కోనసీమలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఏపీలోకి కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్దెత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 40...