Motorola: మోటోరొలా నుంచి మరో కిర్రాక్ స్మార్ట్ ఫోన్ రిలీజ్.. అతి తక్కువ ధరకే అందుబాటులో..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: మోటోరోలా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మోటో జీ06 పవర్ పేరుతో ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్ కలిపి, వినియోగదారులకు స్మూత్, వేగవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్‌లో 6.88 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. ఇది 20.5:9 యాస్పెక్ట్ రేషియో, 395 ppi, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లతో వస్తుంది. అదనంగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. కాబట్టి...