Cough Syrup: ఆ రెండు దగ్గు మందులపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కల్తీ గుర్తించిన కారణంగా రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు దగ్గు మందుల విక్రయాలు రాష్ట్రంలో పూర్తిగా నిషేధించింది. ఈ రెండు సిరప్ లు వినియోగం ప్రజల ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశాలు ఉన్నందున, అన్ని దవాఖానలు, ఫార్మసీలు, మార్కెట్లు వీటిని అమ్మకానికి అందించరాని విధంగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం, ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణ మేల్కొనడానికి ఇదే...