బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేత్రుత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యిందని..ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం ద్రుష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను కోర్టుకు అందించారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా...