గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు.. నిరుద్యోగులకు న్యాయం చేయాలి.. తెలంగాణ జాగృతి ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నిరుద్యోగుల సమస్య మరోసారి ఊపందుకుంది. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో జాగృతి కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ .. గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వడానికే గన్ పార్క్ వద్ద ఈ ధర్నా నిర్వహించాము. పరీక్షల్లో జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. గ్రూప్-1 పరీక్షను రద్దు...