న్యాయం చేయ‌మంటే.. దుర్భాష‌లాడుతున్నాడు..ఆత్మ‌కూరు సీఐ సంతోష్‌కుమార్‌పై ఫిర్యాదురాలు ఆరోప‌ణ‌లు

కాక‌తీయ‌, నిఘా ప్ర‌తినిధి : న్యాయం చేయాల‌ని కోరుతూ పోలీస్ స్టేష‌న్‌లో ఇచ్చిన ఫిర్యాదును ప‌ట్టించుకోక‌పోగా.. ఆత్మ‌కూరు సీఐ సంతోష్‌కుమార్‌ నానా దుర్భ‌ష‌లాడుతున్న‌ట్లు ఇమ్మ‌డి స్వ‌రూప అనే మ‌హిళ వాపోయింది. త‌న కొడుకు-కోడ‌లు మధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌గా, విచార‌ణ జ‌రిపి న్యాయం చేయాల‌ని కోరినా ప‌ట్టించుకోవ‌డం లేదని స్వ‌రూప ఆరోపించింది. పైగా త‌ప్పంతా త‌నదే అయిన‌ట్లుగా సీఐ మ‌ర్యాద ఇవ్వ‌కుండా మాట్లాడిన‌ట్లుగా వాపోయింది. https://youtube.com/shorts/uKtRZYHcoP8?si=ehAlMmj-gQ5JISWf