OLA Electric Vehicle: సర్వీస్‌పై అసంతృప్తి.. షోరూమ్ ముందే ఓలా వెహికల్‌కు నిప్పంటించిన కస్టమర్
కాకతీయ, నేషనల్ డెస్క్: గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో ఓ కస్టమర్ సర్వీస్ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురై, తాను కొన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను షోరూమ్ ముందు నిప్పంటించిన కలకలం రేపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. పాలన్‌పూర్ నివాసి సాహిల్ కుమార్ కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. ఇటీవల తను భార్య, కుమారుడితో షాపింగ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, మార్గ మధ్యలో స్కూటర్ స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. అదృష్టవశాత్తూ సాహిల్...