PM Modi: పీస్‌ ప్లాన్‌పై ఇజ్రాయెల్‌-హమాస్‌ సంతకాలు.. స్వాగతించిన భారత్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ముగింపు దిశలో ముందడుగు వేయడం ప్రారంభించింది. గాజా ప్రాంతంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇజ్రాయెల్, హమాస్ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు వెల్లడించారు. భారతదేశం కూడా ఈ శాంతి ప్రణాళికను స్వాగతించింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ట్విట్టర్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) నేతృత్వాన్ని...