Local Elections Notification: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలివే..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ గెజిట్ విడుదల చేసింది. రిటర్నింగ్ అధికారులు మొదటి విడత నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్లు ఈ నెల 11 వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 12 తేదీ, ఉపసంహరణకు గడువు 15 తేదీ వరకు ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో 292 జెడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుంది. నామినేషన్ దాఖలుకు కావలసిన పత్రాలు, అర్హతలు: *అభ్యర్థి...