ప్రభుత్వ అధికారులను ఈసీ బెదిరిస్తోంది.. దీదీ కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం కోల్‌కతాలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఎన్నికల కమిషన్ అధికారులు తమ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని, ఇంకా ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే రాజకీయ ఒత్తిడితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మమతా మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పిలిపించి బెదిరిస్తోంది. ఇది రాజ్యాంగబద్ధ వ్యవస్థకు విరుద్ధం. ఎన్నికల తేదీలు ఇంకా...