తాలిబాన్ మంత్రి భారత్ పర్యటన.. భారత్-అఫ్ఘాన్ స్నేహంపై పాకిస్తాన్ కలవరం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి గురువారం ఢిల్లీలో అడుగుపెట్టారు. 2021లో తాలిబన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశానికి వస్తున్న తొలి ఉన్నత స్థాయి తాలిబన్ నేత ఆయనే కావడం విశేషం. ఆరు రోజులపాటు కొనసాగే ఈ పర్యటనలో, ముత్తాకి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన భారతదేశ–ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల పునరుద్ధరణకు కీలకంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐరాస ఆంక్షల ఎత్తివేత తర్వాత పర్యటన: ఐక్యరాజ్యసమితి...