WhatsAppలో ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? స్టెప్-బై-స్టెప్ ఇలా తెలుసుకోండి..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: ప్రభుత్వం ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ, పౌరులు వేగంగా తమ ఆధార్ కార్డును పొందే విధంగా కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు DigiLocker లేదా UIDAI వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, ఆధార్ కార్డును WhatsApp ద్వారా నేరుగా పొందే సౌకర్యం ప్రారంభమైంది. ఈ సదుపాయం MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా లభిస్తుంది. అంటే, మీరు వెబ్‌సైట్‌లు తిరగకుండా, కొన్ని సులభమైన మెసేజ్‌లతోనే ఆధార్‌ను మీ ఫోన్‌లో...