పీఎంఏవై అర్బన్ పై అవగాహన కల్పించాలి

బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అంగీకార్- 2025 పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, వరంగల్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై- అర్బన్) 2.0 కార్యక్రమంపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కలిగించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. శుక్రవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పిఎంఏవై- అర్బన్- 2.0 అవగాహనలో భాగంగా రూపొందించిన అంగీకార్- 2025 పోస్టర్ ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పి ఎం ఏ...