Degree Student: ప్రేమించాలంటూ వాలీబాల్ కోచ్ వేధింపులు..డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో ఘోరం జరిగింది. లాలాగూడ ప్రాంతంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన పూర్తి సమాచారం ప్రకారం, సాయిబాబా దేవాలయం సమీపంలో నివసిస్తున్న మౌలిక (19) అనే యువతి, తార్నాకాలోని రైల్వే డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో అంబాజీ అనే వ్యక్తి వాలీబాల్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అంబాజీ మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, పలుమార్లు ఆమెను బాధపెట్టాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వేధింపులను తట్టుకోలేక మౌలిక తీవ్ర మనోవేదనకు...