Crime : మద్యం మత్తులో యువకుడు ఆర్టీసీ బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు మండల కేంద్రంలో మద్యం మత్తులో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, బంజ్ జాన్ అనే యువకుడు మద్యం సేవించి రోడ్లపై అల్లరి చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేశాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన ఆర్టీసీ బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. బాటిల్‌ను బస్సు అద్దాలపై విసిరి పగులగొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమయంలో బస్సులో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారని, ఒక్కసారిగా బాటిల్ పగలడంతో వారు గందరగోళానికి...