డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్..దక్కని నోబెల్ శాంతి బహుమతి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ మిస్ అవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు ప్రపంచశాంతికి కృషి చేసిన మహానుభావులు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటుంటే..మరోవైపు కొన్ని వివాదాస్పద వ్యక్తులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రముఖ ప్రతిపక్ష నాయకురాలు, కొరినా మచాడోకు ప్రదానం చేశారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఏటా శాంతిని ప్రోత్సహించడానికి, దేశాల మధ్య సోదరభావాన్ని బలోపేతం చేయడానికి,...