Earthquake in Philippines: ఫిలిప్పీన్స్ దగ్గర సముద్రంలో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఫిలిప్పీన్స్ సమీప సముద్ర తీరంలో భారీ భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతమైన మిండనావో సముద్ర పరిధిలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం నమోదైనట్టు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. ఈ ప్రకంపనల కారణంగా తీరప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూకంప కేంద్రం శాంటియాగో పట్టణానికి తూర్పు దిశగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) వివరించింది....