ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు వెంటనే ఇవ్వాలి
టీ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కాకతీయ, కరీంనగర్ : ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వారికిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ విమర్శించారు. కరీంనగర్‌లో ఆటో కార్మిక సంఘం నాయకుడు కొత్తూరి రఘుతో పాటు పలువురు సభ్యులు జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా వారికి జాగృతి కండువాలు కప్పి హరిప్రసాద్ ఆహ్వానించి మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం...