బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి కాకతీయ, నల్ల బెల్లి : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి తీవ్రంగా విమర్శించారు. శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 చట్టపరంగా నిలబడదని తెలిసీ కూడా విడుదల చేయడం రాజకీయంగా బీసీలను మోసం చేయడమేనన్నారు. బీసీలకు నిజమైన రిజర్వేషన్లు...