బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి

స్పెషల్ జ్యూడీషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు కాకతీయ, కొత్తగూడెం రూరల్: బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని స్పెషల్ జ్యూడీషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు అన్నారు. ప్రపంచ బాలిక దినోత్సవం సందర్భంగా పాల్వంచలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాలికల పట్ల సమాజంలో ఇంకా కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, భద్రతా లోపాలు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు అవగాహన అవసరమని తెలిపారు. బాలికల విద్య, వైద్యసేవలు, పోషణ,...