అవసరం లేని పురుగుమందులను అంటగడుతున్న వైనం మోతాదు పెంచి అమ్ముతూ లాభాలు గడిస్తున్న వ్యాపారులు పంట నష్టంతో బెంబేలెత్తుతున్న రైతులు న్యాయం చేయాలంటూ వేడుకోలు కాకతీయ, నర్సింహులపేట : ఆరుగాలం కష్టపడే రైతన్నకు అడుగడుగునా అవరోధాలే ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు అకాల వర్షాలతో సతమతమైన రైతులకు ఒకవైపు యూరియా సంక్షోభం తలెత్తింది. వేకువ జామున లేచింది మొదలు రాత్రి వరకు యూరియా కోసం జాగారం చేయడం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ప్రతీ సమస్యను ఎలాగోలా నెట్టుకొస్తున్న అన్నదాతకు క్రిమి సంహారక రసాయానుల విక్రయదారుల నుంచి...