క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ గా రంగాపూర్ జట్టు
కాకతీయ, పినపాక : పినపాక మండలం తోగూడెం గ్రామపంచాయతీ గోపాలరావుపేట గ్రామంలో దసరా, దీపావళి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ రంగాపూర్, కాటాపూర్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలో విజేతగా రంగాపూర్ జట్టు నిలిచింది. మొదటి బహుమతి రూ.30 వేలు, షీల్డ్ లూబి మోటార్స్ సంస్థ నుండి అందజేశారు. రన్నరప్ గా నిలిచిన కాటాపూర్ జట్టుకు డీజే సతీష్ జ్ఞాపకార్థం అతని స్నేహితులు రూ.20వేలు అందించారు. గోపాలరావుపేట గ్రామానికి చెందిన నాయకులు బుసి...