కార్పొరేటర్ ఇంటిపై దాడికి యత్నం

మిక్కిలినేని దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడిఓఎస్ కాలనీలో ఉద్రిక్తత కాకతీయ, ఖమ్మం : జిల్లాకేంద్రంలోని 54 డివిజన్ వీడిఓఎస్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సాయంత్రం నుండి ఆదివారం వరకు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ భర్త, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని నరేందర్ పై దాడికి కొంతమంది ప్రయత్నించారని ఆరోపిస్తూ మిక్కిలినేని వర్గీయులు ఆందోళనకు దిగారు. శనివారం సాయంత్రం నుండి కార్పొరేటర్ మంజుల తన వర్గీయులతో కలిసి రోడ్డుపై బైఠాయించి...