ఘనంగా భగవాన్ దాస్ వర్ధంతి

కాకతీయ, హనుమకొండ : భగవాన్ దాస్ 22వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరై భగవాన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భగవాన్ దాస్ వరంగల్ అభివృద్ధిలో, పేదల హక్కుల కోసం ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీ, బుద్ధభవన్ నిర్మాణం వంటి ప్రాజెక్టుల ద్వారా నగర అభివృద్ధికి చేసిన తపనను కొనియాడారు. అనంతరం క్రెడాయి ఆధ్వర్యంలో నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో రక్తదాన శిబిరం...