శబరిమల ఆలయంలో బంగారం చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
బండి సంజయ్‌కు కరీంనగర్ అయ్యప్ప సేవా సమితి వినతి కాకతీయ, కరీంనగర్ బ్యూరో : శబరిమల శ్రీ ధర్మశాస్త దేవస్థానంలో బంగారు ఆభరణాల చోరీ, దేవాలయ ఆస్తుల దుర్వినియోగం, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా అయ్యప్ప సేవా సమితి సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు కె. పరమేశ్వర్...