ఉత్సాహంగా కరీంనగర్ మారథాన్

కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ : కరీంనగర్ సైక్లిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. 3, 5, 10, 21 కిలోమీటర్ల పరుగులో పెద్ద ఎత్తున విద్యార్థులు మొదలుకొని వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి సైతం ఔత్సాహికులు ఈ మారథాన్ కు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 10, 21 కిలోమీటర్ల పరుగును ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఓ.ఎస్.డి వేముల శ్రీనివాసులు 3, 5 కిలోమీటర్ల మారథాన్ రన్...