పోలియో చుక్కలు తప్పని సరి
ఆత్మకూరు మండల వైద్యాధికారి స్పందన కాకతీయ,ఆత్మకూరు : పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆత్మకూరు మండల వైద్యధికారి డాక్టర్ స్పందన తెలిపారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ స్పందన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో వేయించాలని తల్లితండ్రులకు సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమం అక్టోబర్ 14 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలియో చుక్కలు వేసుకొనని పిల్లలకు 13, 14...