పోలియో చుక్కలు తప్పక వేయించాలి
హనుమకొండలో 472 పోలియో చుక్కల కేంద్రాలు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో : ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్...