ఇష్టంతో కష్టపడి పని చేయాలి
మహిళలకు అన్ని సాధ్యమే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి :సాధించాలనే సంకల్పం, సరియైన ప్రణాళిక, శారీరక సుఖాలను త్యాగం చేసే గుణం, ఆచరణలో అమలు పెట్టే తత్వం ఉంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను పొందవచ్చుని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి మురారి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇష్ట పడి కష్టమైన పని...