స్నేహితుడికి ఆపన్నహస్తం

కాకతీయ, హనుమకొండ : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రాజోజు రామచంద్రాచారికి తన మిత్రులు ఆర్థిక సాయం అందించి తమ ఔదార్యన్ని చాటారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 బ్యాచ్‌కు చెందిన రాజోజు రామచంద్రాచారి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆపదలో ఉన్న మిత్రుడి విషయం తెలుసుకున్న మిత్రులు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం నలభైవేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ...