దళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకోవాలి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కాకతీయ, తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మందుల సామేలుప్రారంభించి మాట్లాడారు. ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దళారుల మాటలు విని తొందరపడి తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని సూచించారు. కేంద్రాల్లోకి తీసుకువచ్చిన ధాన్యాన్ని విక్రయించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు...